శరత్ కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష..!

తమిళ నటుడు శరత్ కుమార్ ఆయన భార్య నటి రాధికలకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శరత్ కుమార్, ఆయన భార్య రాధికలకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధించింది. వివరాల మేరకు 2015లో ‘ఇదు ఎన్న మాయం’ సినిమా కోసం రాధికా, శరత్ కుమార్ లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. 

అయితే తీసుకున్న అప్పును వీరు సకాలంలో తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియంట్ గ్రూప్ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

  

 

Leave a Comment