కారులో శానిటైజర్ పెడుతున్నారా..అయితే జాగ్రత్త..

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. దీంతో కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన సూచనలను తప్పనిసరిగా పాటించడం జరుగుతోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తున్నారు. చేతులను కూడా శుభ్రంగా కడుక్కుంటున్నారు. 

బయటకు వెళ్లే టప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్ ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం శానిటైజర్ ని ప్రతి ఒక్కరూ తమ వెంట పెట్టుకుని తిరిగుతున్నారు. అయితే శానిటైజర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రక్షణకు బదులు ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కారులో ప్రయాణం చేసేటప్పుడు శానిటైజర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కారు ప్రయాణాల తర్వాత వేడిగా ఉన్నప్పుడు వాటిలో శానిటైజర్లను ఉంచకూడని అమెరికల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఎందుకంటే శానిటైజర్ లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది బయటకొచ్చి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. దీంతో కార్టు కాలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల అమెరికాలో ఓ కారు శానిటైజర్ వల్ల కాలిపోవడంతో ఈ హెచ్చరిక జారీ చేశారు. 

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు ప్రతి ఒక్కరూ అల్లాడుతున్నారు. కార్లు కూడా ఎండకు వేడెక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. సో..కారులో ప్రయాణం చేసేటప్పుడు శానిటైజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

Leave a Comment