గో మూత్రంతో శానిటైజర్..!

త్వరలో గోమూత్రంతో తయారు చేసిన శానిటైజర్ మార్కెట్ లోకి రానుంది. గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన సహకార సంఘం ఆవు మూత్రంతో శానిటైజర్ ను తయారు చేసింది. ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్ కి చెక్ పెట్టేందుకు దీనిని తయారు చేశారు. మరో వారం రోజుల్లో ఈ శానీటైజర్ కు లైసెన్స్ వస్తుందని, త్వరలోనే మార్కెట్ లో విడుదల చేస్తామని కామధేను దివ్వ ఔషధి మహళా మండలి పేరుతో కొనసాగుతున్న సహకారం సంఘం తెలిపింది.

ఈ శానిటైజర్ ను గో-సేఫ్(Go Safe) బ్రాండ్ పేరుతో విడుదల చేయనున్నట్లు సహకార సంఘం డైరెక్టర్ మనీషా తెలిపారు. గోమూత్ర హ్యాండ్ శానిటైజర్ తయారీలో గోమూత్రంతో పాటు వేప, తులసి వంటి సహజ మూలికలను ఉపయోగించినట్లు చెప్పారు. ఎఫ్డీసీఏ నుంచి గోమూత్రంతో తయారీ, మార్కెటింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. వారం రోజుల్లో అనుమతి వస్తుందన్నారు. అంతే కాకుండా గోమూత్రంతో ఇప్పటికే ఈ సంస్థ ఉపరితల శానిటైజర్(GO Protect), రూం క్లీనర్ లిక్విడ్ (Go Clean) ను విడుదల చేసింది.  

 

Leave a Comment