‘కోవిడ్ వ్యాక్సిన్ తో నపుంసకత్వం’

సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా కరోనా వ్యాక్సిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకులు అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్న సందర్భంలో ఎస్పీ నేత వ్యాఖ్యలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 

ఇప్పటికే యూపీ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనని వెల్లడించిన సంగతి తెలిసిందే.. కాగా అదే పార్టీకి చెందిన అశుతోష్ సిన్హా కరోనా వ్యాక్సిన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. తాము కేంద్రం, రాష్ట్రంలో ఉన్న బీజీపీని నమ్మమన్నారు.

 తమ నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ తోసుకోనంటున్నారంటే, ఆయనకు వ్యాక్సిన్ విషయంలో ఏవైనా వాస్తవాలు తెలిసి ఉంటాయని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రజలకు హానీ చేస్తుందన్నారు. కోవిడ్ టీకా తీసుకుంటే నపుంసకులవుతారన్నారు. తమ పార్టీ కార్యక్తలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా టీకాకు దూరంగా ఉండాలని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఖండించారు.

 కరోనా టీకా కారణంగా మహిళలు కానీ, పురుషులు కానీ నపుంసకులు అవుతారని శాస్త్రవేత్తలు చెప్పలేదన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేేవన్నారు. నిరాధారమైన ఊహాగాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ టీకా వేయించుకున్న తర్వాత కొద్ది మందిలో స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో నొప్పి ఉంటుందని అన్నారు. 

Leave a Comment