సల్మాన్ ఖాన్ కి పాముకాటు..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు పాము కాటేసింది. మహారాష్ట్రలోని పన్వేల్ లో పామ్ హౌస్ లో శనివారం రాత్రి ఆయన పాముకాటుకు గురయ్యారు. దీంతో సల్మాన్ ఖాన్ ని వెంటనే  ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్ ఖాన్ కి విషం లేని పాము కాటు వేయడంతో ప్రమాదం తప్పినట్లు వైద్యులు తెలిపారు.

క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఫామ్ హౌస్ కి వెళ్లిన సల్మాన్ ని పాము కాటేసింది. దీంతో ఆయన్ను నవీ ముంబైలోని కమౌతే ప్రాంతంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా రేపు సల్మాన్ ఖాన్ 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ సమయంలో ఆయనకు పాము కాటేయడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను సింపుల్ గా ఫామ్ హౌస్ లోనే తన ఫ్యామిలీతో జరుపుకోనున్నారు.  

Leave a Comment