మోడలింగ్ లో దూసుకుపోతున్న.. సచిన్ కూతురు సారా టెండూల్కర్..!

 ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్  క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం.

సచిన్ భార్య పేరు అంజలీ. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వారే అర్జున్, సారా టెండూల్కర్ లు. అర్జున్ క్రికెట్ లోనే తన కెరీర్ ను కొనసాగిస్తుండగా సారా లండన్ లో ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ ఫ్యాషన్ ఐకాన్ అవుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ బాలీవుడ్ స్టార్లకు పోటీగా క్యూట్ లుక్‌తో యూత్‌ను కట్టిపడేస్తోంది. కొత్త, కొత్త స్టైల్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంటోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఏకంగా మూడు లక్షలమంది ఫాలోఅవుతున్నారు.

సచిన్ కూతురు సారా టెండూల్కర్.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివి లండన్ లో గ్రాడ్యుయేషన్ పొందారు. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. ఈ మేరకు పాపులర్ క్లాతింగ్ బ్రాండ్ కోసం మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెడిసిన్‌ను పూర్తి చేసిది సారా టెండూల్కర్. ఆ తర్వాత ఓ క్లాతింగ్ బ్రాండ్ ద్వారా మోడలింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టింది. సహారా కప్‌ టోర్నీలో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత ఆ విజయానికి గుర్తుగా సచిన్ టెండూల్కర్ తన కూతురికి సారా అని పేరు పెట్టుకున్నారు.

 ఇండియాలో మోస్ట్ పాపులర్ కిడ్స్‌లో సారా టెండూల్కర్ ఒకరు. ఎందుకంటే ఆమె క్రికెట్ లెజెండ్ సచిన్ కూతురు. సారాకు సోషల్ మీడియాలో బీభత్సమైన పాపులారిటీ ఉంది. మిలియన్ల మంది ఫ్యాన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో సారా టెండూల్కర్ యాక్టివ్‌గా ఉంటుంది. వీలుచిక్కినప్పుడల్లా కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తుంది. ఈ మధ్య మరీ యాక్టివ్‌గా ఉంటోంది. సినిమా హీరోయిన్లలా బ్యూటిఫుల్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

సారా టెండూల్కర్ తన తల్లిలానే మెడిసిన్ చదువుకుంది. కానీ మెడిసిన్ పూర్తయ్యాక మోడలింగ్‌పై దృష్టిసారించింది. మోడలింగ్ రంగంపై ఆసక్తితోనే ఇన్‌స్టగ్రామ్‌లో కొత్త కొత్త ఫొటోలను సారా షేర్ చేస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. సచిన్ కూతురు చాలా అందంగా ఉందని, భవిష్యత్‌లో మంచి హీరోయిన్ అవుతుందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో సారా టెండూలర్క్ ఏ పోస్ట్ పెట్టినా.. వేలల్లో లైక్స్ వస్తుంటాయి. మంచి ఫొటో ఏదైనా పోస్ట్ చేస్తే కామెంట్లు వెల్లువెత్తుతాయి. ముంబైలో ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువు పూర్తయ్యాక సారా లండన్‌కు వెళ్లిపోయినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

 

Leave a Comment