అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ ను ఆర్ఆర్ఆర్ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 

దసరా పండుగ సందర్శంగా అక్టోబర్ 13న సినిమా విడుదల కానున్నట్లు తెలియజేస్తూ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బెల్లెట్ పై దూసుకుపోతుండగా, రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. కాగా, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఇంగ్లీష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.  

You might also like
Leave A Reply

Your email address will not be published.