‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ సునామీ.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాక్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. మొదటి రోజు నుంచే మంచి హిట్ టాక్ అందుకుంది.. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని భాషల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.257.15 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.. తొలిరోజున తెలుగురాష్ట్రాల్లో సుమారు 120.19 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.. హిందీలో 22.6, కర్ణాటక 16.4, తమిళనాడులో 12.73 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.  

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు అలియా భట్, అజయ్ దేవ్ గణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో నటించారు. దీంతో హిందీలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేశారు. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం తక్కువగానే వచ్చాయి. తొలిరోజు హిందీలో 22.6 కోట్లు వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 తొలిరోజు 41 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమాతో పోలిస్తే.. ‘ఆర్ఆర్ఆర్’కు సగం వసూళ్లు మాత్రం వచ్చాయి. 

Leave a Comment