‘RRR’ మోషన్ పోస్టర్ విడుదల

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ గురించి అందిరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా రాజమౌళి తన అభిమానులకు కానుక ఇచ్చారు. ‘RRR’ మోషన్ పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. మోషన్ పోస్టర్ లో ఆర్ అంటే రౌద్రం, ఆర్ అంటే రణం, ఆర్ అంటే రుధిరం అని చూపించారు. ఇందులో రామ్ చరణ్ ను అగ్ని కణాల మధ్య, ఎన్టీఆర్ ను స్వచ్ఛ మైన జలాల మధ్య చూపించారు. రౌద్రానికి, రుధిరానికి మధ్య జరిగే రణంగా ఈ చిత్రం ఉండబోతోందని మోషన్ పోస్టర్ చెబుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్ గన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తీస్తున్నారు. S

Leave a Comment