రోహిత్ శర్మ సిక్సర్..పాపం చిన్నారికి గాయం..రోహిత్ ఏంచేశాడంటే..!

ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ వల్ల పాపకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ విల్లే వేసిన ఓ బంతిని టీమిండియా కెప్టెన్ రోహిత్ పుల్ షాట్ ఆడాడు. ఆ బంతి స్టేడియంలో కూర్చున్న ఓ చిన్నారికి బలంగా తాకింద.. దీంతో ఆ పాప నొప్పితో విలవిల్లాడింది. 

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఈ విషయం చెప్పాడు. రోహిత్ దగ్గరికి వచ్చిన బెయిర్ స్టో.. చిన్నారికి గాయమైన  విషయాన్ని  తెలియజేశాడు. దీంతో ఆ పాప పట్ల రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. 

ఈ  క్రమంలో కొద్దిసేపు మ్యచ్ ఆగిపోయింది. అనంతరం ఇంగ్లాండ్ ఫిజియోలు చిన్నారి దగ్గరకు వెళ్లి  ప్రథమ చికిత్స చేశారు.  అయితే ట్విటర్ లో పాపతో దిగిన ఫోటోను ఓ అభిమాని పోస్ట్ చేశాడు. ఆ చిన్నారి పేరు  మీరా సాల్వి అని తెలిపాడు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని ఫోటో పోస్ట్ చేసి కామెంట్ చేశాడు.

సర్ ప్రైజ్ చేసిన రోహిత్:

పాపకు గాయమైన విషయం తెలుసుకున్న రోహిత్ శర్మ చిన్నారికి సర్ ప్రైజ్ చేశాడు. మ్యాచ్ అనంతరం పాప దగ్గరికి వెళ్లి ఓ బొమ్మతో పాటు చాక్లెట్ ని ఇచ్చాడు. హిట్ మ్యాన్ చేసిన పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. 

 

Leave a Comment