టాలీవుడ్ లో ఈ పరిస్థితికి రాజమౌళి కారణం.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పరిస్థితి రావడానికి దర్శకుడు రాజమౌళి కారణమంటూ వ్యాఖ్యానించాడు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.. ఓటీటీలు, నటీనటులు, హీరోల రెమ్యూనరేషన్ దీనికి ప్రధాన కారణమని నిర్మాతలు ఆరోపించారు.. థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, సినిమాపై పెట్టిన ఖర్చు సైతం రావడం లేదని ‘’యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ షూటింగ్‌లకు బంద్ ప్రకటించాయి. 

ఈ క్రమంలో షూటింగ్స్‌ బంద్‌పై కాంట్రవర్సీ కింగ్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ తెలుగు ఛానల్‌తో ముచ్చటించిన ఆయన.. టాలీవుడ్‌కు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి, యూట్యూబ్‌ చానళ్లని.. ఓటీటీలు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం ప్రేక్షకులు షాట్‌ వీడియోలకు అలవాటు పడ్డారు. ఎక్కువగా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నారు. థియేటర్లో రెండు గంటల పాటు ఓపిగ్గా సినిమా చూడాలంటే రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ లేదా కేజీయఫ్‌ లాంటి సినిమాలు మాత్రమే తీయాలి’ అని వ్యాఖ్యానించారు.

Leave a Comment