#ResignModi బ్లాక్ చేసిన ఫేస్ బుక్.. నెటిజన్లు విమర్శించడంతో…

ఇటీవల ఫేస్ బుక్ లో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లో ఉంది. కరోనా కట్టడిలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమవ్వడంతో కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో #ResignModi అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ను ఊహించడంలో కేంద్రం విఫలమవ్వడం, ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్ల కొరతకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ తన పదవి నుంచి వైదొలగాలని నెటిజన్లు ఈ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. 

అయితే ఈ హ్యాష్ ట్యాగ్ తో ఉన్న పోస్టులను ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఈ హ్యాస్ ట్యాగ్ ను ఫేస్ బుక్ తొలగించిందని విమర్శలు వస్తున్నాయి. దీంతో కొన్ని గంటల్లోనే #ResignModi హ్యాష్ ట్యాగ్ ని మళ్లీ రీస్టోర్ చేసింది. పొరపాటు వల్లే ఈ హ్యాష్ ట్యాగ్ తాత్కాలికంగా బ్లాక్ అయిందని వివరణ ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదని ఫేస్ బుక్ కమ్యూనికేషన్ల విభాగ అధికారి ఆండీ స్టోన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ను రిస్టోర్ చేశామని, అలాగే బ్లాక్ కు గల కారణాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 

Leave a Comment