ఎలుకలు కూడా కార్లు నడపగలవు..!

సాధారణంగా యానిమేషన్ సినిమాల్లో మాత్రమే జంతువులు కార్లు నడపగలవు.. కానీ  యూఎస్ లోని రిచ్ మండ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో ఎలుకలు కూడా కార్లు నడుపగలవని నిరూపించారు శాస్త్రవేత్తలు.. ప్రత్యేకంగా తయారు చేసిన కారు లాంటి వాహనాన్ని ఎలుకలు నడుపుతున్నాయి.. ఎలుకలు నడుపుతున్న కారు నిజమైంది కాదు.. ఖాళీ ప్లాస్టిక్ పెట్టెలతో తయారు చేశారు. అయితే ఈ కారును నడపగల నైపుణ్యాన్ని ఎలుకలు స్వయంగా సంపాదించుకోవడం అనేది ఇక్కడ పెద్ద సక్సెస్ అని చెప్పాలి. 

యూనివర్సిటీ ఆఫ్ రిచ్ మండ్ లోని కెల్లీ లాంబెర్ట్ ఈ చిన్న కార్లను తయారు చేశారు.  ఈ కారు  లోపల ఎలుకలు తాకేలా మూడు రాగి కడ్డీలు ఉన్నాయి. ఎలుకలు బార్ ని తాకినప్పుడల్లా, అది సర్క్యూట్ ని పూర్తి చేస్తుంది. అప్పుడు కారు కదులుతుంది. ఎడమ వైపున ఉన్న బార్ కారును ఎడమ వైపుకు, కుడి వైపున ఉన్న బార్ కారును కుడి వైపుకు కదిలిస్తుంది. ఈ ప్రయోగం కోసం ఆరు ఆడ, నాలుగు మగ ఎలుకలను ఎంపిక చేసుకున్నారు. ఈ కార్లను నడపడానికి వాటికి శిక్షణ ఇచ్చారు. కారు ముందు ఆహారం పెట్టి.. అవి అటువైపు కారు నడిపేలా శిక్షణ ఇచ్చారు. 

Leave a Comment