మహేష్ సినిమాలో నటించడంపై రేణుదేశాయ్ క్లారిటీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ నటిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. మహేష్ బాబుకు వదినగా రేణు దేశాయ్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

తాజాగా ఈ వార్తపై రేణు దేశాయ్ స్పందించారు. సర్కారు వరి పాట సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. తాను ఏ ప్రకటన చేయాలనుకున్నా.. తనకు సంబంధించిన సినిమా ఏదైనా కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమాచారం ఇస్తానని ప్రకటించారు. ఎప్పుడైతే తాను సమాచారం ఇస్తానో అప్పేడే నమ్మాలని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. దీంతో సర్కారు వారి పాట సినిమాలో రేణు దేశాయ్ నటిస్తున్నారన్న పుకార్లుకు పులిస్టాప్ పడింది…

Leave a Comment