దేవుడు, దేవాలయాలపై షాకింగ్ కామెంట్ చేసిన రేణు దేశాయ్..!

103
Renu Desai

రేణు దేశాయ్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో విడిపోయిన రేణు దేశాయ్ ప్రస్తుతం తమ కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్యాలతో జీవిస్తోంది. ఆమె కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. 

తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విగ్రహాలు, గుళ్ల గురించి మాట్లాడారు. ‘ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ దేవుడు దేవాలయాలను రంగులతో నింపేయమని చెప్పాడా? దేవాలయాలను అద్భుతంగా కట్టమని అడిగాడా? అని సందేహం వస్తుంటుంది. అది కేవలం మన దురాశేనా? అని అనిపిస్తుంటుంది. అందుకే దేవుడి పేరుతో మనం అలా చేస్తున్నామా? వజ్రాలు, బంగారం అంటూ దేవుడిని అలంకరిస్తున్నామా? అని అనిపిస్తుంటుంది’ అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. 

అంతేకాదు రేణు దేశాయ్ ఓ వినాయకుడి విగ్రహం ఫొటో షేర్ చేస్తూ.. ఇలా సింపుల్ గా ఉంటే దేవుడు అనిపించుకోలేడా? భక్తి అనిపించుకోదా? అని ప్రశ్నించారు. ఎలాంటి ఆర్భాటాలు అవసరం లేకుండా భక్తిని చాటుకోవచ్చంటూ రేణు దేశాయ్ చెప్పిన సందేశం అందరికీ తెగ నచ్చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

Previous articleఈ ఫొటోలో ఉన్నదేంటో గుర్తుపట్టగలరా..?
Next articleఆడపిల్ల పుట్టిందని రూ.40 వేల పానీపూరీని ఉచితంగా అందించిన తండ్రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here