అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో..!

రిలయన్స్ జియో టెలికం రంగంలో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ ను లాంచ్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ గురువారం ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త జియో నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ ను అభివృద్ధి చేశారు. జియో నెక్ట్స్ ఫోన్ ను  సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్, వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్ట్స్, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్, అగుమెంట్ రియాలిటీతో కూడిన స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ కు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత అనేది ప్రకటించలేదు. ఈ మొబైల్ ధర రూ.5,000 లోపు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  

 

  

 

Leave a Comment