రిలయన్స్ జియో గ్లాస్ ఆవిష్కరణ..ప్రత్యేకతలు ఇవే..!

రిలయన్స్ 43వ ఏజీఎం వర్చువల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా  రిలయన్స్ జియో టీవీ ప్లస్, జియో గ్లాస్ లను ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీలు ఆవిష్కరించారు. రిలయన్స్ గ్లాస్ పేరుతో కొత్త ఆవిష్కరణ చేసినట్లు రిలయన్స్ ప్రకటించింది. దీని ద్వారా టీవీ ప్రసారాల్లో సరికొత్త అనుభూతులు పొందవచ్చు. జియో గ్లాస్ బరువు 75 గ్రాములు ఉంటుంది. ఈ జియో గ్లాస్ కి ఓ కేబుల్ ద్వారా మన ఫోన్ కు ఎటాచ్ చేయవచ్చు. దీని ద్వారా ఇంటర్నెట్ తో కనెక్ట్ కావచ్చు. ఈ గ్లాస్ కు హై రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. జియో గ్లాస్ కు అదనంగా ఆడియో డివైజ్ లు అవసరం లేదు. దీనికి పర్సనలైజ్డ్ ఆడియో ఉంటుంది. జియో గ్లాస్ కు 25కు పైగా సాంకేతిక కార్యక్రమాల అనుసంధానం ఉంటుంది. హోలో గ్రాఫిక్ డిజైన్ ఉంటుంది.

జియో టీవీ ప్లస్..

జియో టీవీ ప్లస్ లో 12 ఓటీటీ కార్యక్రమాలు ఉంటాయి. ప్రధాన ఛానల్స్ అన్నీ జియో టీవీ ప్లస్ లో రిలయన్స్ చేర్చింది. సెట్ అప్ బాక్సులోని యాప్ స్టోర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. సెట్ అప్ బాక్సులో ఏ యాప్ డెవలప్ అయినా తమ యాప్స్ పెట్టుకోవచ్చు. ఆ యాప్స్ సేవల ద్వారా ఆదాయం కూడా పొందవచ్చని రిలయన్స్ పేర్కొంది. 

 

Leave a Comment