యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డీజీ ఔషధం విడుదల..!

కరోనా రోగుల కోసం డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీజీ(2డీఆక్సీ డీగ్లూకోజ్) ఔషధం విడుదలైంది. 2-డీజీ తొలి బ్యాచ్ ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో 10 వేల ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు.  

నోటి ద్వారా తీసుకునే 2-డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతించింది. ఈ ఔషధాన్ని ఆస్పత్రిలో చేరిన రోగులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్లో తేలిందని రక్షణ శాఖ వెల్లడించింది. 

ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు లేవు.. డీఆర్డీవో సంస్థ ఈ 2-డీజీ పొడిని తయారు చేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చు. ఈ మందును నీటిలో కలుపుకొని తాగవచ్చు. డ్రగ్ తీసుకున్న రోగులలో రెండు మూడు రోజుల్లో తేడా కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. 

Leave a Comment