అబ్బాయిల స్టామినాపై రెజీనా షాకింగ్ కామెంట్స్.. మ్యాగీలా 2 నిమిషాలేనట..!

రెజీనా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లే పేరు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకిని డాకిని’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రెజీనాతో పాటు నివేధా థామస్ కూడా నటిస్తోంది.. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కి ‘శాకిని డాకిని’ రీమేక్.. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు..సెప్టెంబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రెజీనా జోరుగా పాల్గొంటుంది. 

ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా తమకు నచ్చిన ఫుడ్ ఛానల్స్ తో కూడా సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా ఓ తెలుగు ఫుడ్ ఛానల్ ఒకదానిలో ‘శాకిని డాకిని’ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు రెజీనా, నివేదా థామస్.. ఈ సందర్భంగా రెజీనా అబ్బాయిలకు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘అబ్బాయిలు మ్యాగీ నూడిల్స్ రెండు ఒకటే.. రెండు నిమిషాల్లో అయిపోతారు’ అని కామెంట్ చేసింది.

ముందు రెజీనా చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్ అక్కడున్న యాంకర్ కి అర్థం కాలేదు. ఇది గమనించిన రెజీనా మీకు జోక్ అర్థం కాలేదు అనుకుంటా అంటూ రెజీనా కామెంట్ చేసింది. తర్వాత ఆ యాంకర్ కి బల్బ్ వెలగడంతో నోరు వెళ్లబెట్టాడు. ఇదంతా తింటూ గమనిస్తున్న నివేదా నవ్వు ఆపుకోవడానికి ప్రతయ్నించింది. అయితే రెండు నిమిషాలు అనే దాని గురించి రెజీనా విశదీకరించి చెప్పలేదు.. కానీ పరోక్షంగా అబ్బాయిల సెక్స్ స్టామినా మీదే కామెంట్ చేసిందని నెటిజన్లు భావిస్తూ కామెంట్ చేస్తున్నారు.  

 

Leave a Comment