మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో మద్యం ధరలు తగ్గింపు.. ఇకపై అన్ని బ్రాండ్లు..!

ఏపీ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యాట్ తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేసింది. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై 20 నుంచి 30 రూపాయలు తగ్గే ఛాన్స్ ఉంది. 

ఐఎంఎల్ లిక్కర్ పై 35 నుంచి 50 శాతం ధరలు తగ్గే అవకాశం ఉంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్ లో ధరలు ఎక్కువ ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం వస్తోంది. అక్రమ మద్యం అడ్డుకట్ట వేసేందుకు వ్యాట్ క్రమబద్దీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ప్రముఖ బ్రాండ్ల మద్యం కూడా లభించదు. ఇక్కడ ఓన్లీ ఫర్ ఆంధ్ర సేల్ బ్రాండ్లు మాత్రమే లభిస్తాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి బ్రాండ్ మద్యం ఏపీలో అక్రమంగా వస్తోంది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఇక నుంచి ప్రముఖ కంపెనీ బ్రాండ్లను కూడా అమ్మాలయి నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.  

 

Leave a Comment