పతనమవుతున్న బంగారం ధర

గత కొంత కాలంగా బంగారం ధరల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ఏడేళ్లు గతంలో ఏడేళ్ల గరిష్ట ధరకు చేరిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో పాటుగా మార్కెట్ కుదేలవ్వడంతో ఆ నష్టాలను పూడ్చుకోవడానికి బంగారం నిల్వలను అమ్ముకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ దీనికి కారణం. దీంతో పాటుగా ఇండియాలో రూపాయి విలువ బలపడుతూ వస్తుంది. 

దీని వలన బంగారం దిగుమతులపై భారం తగ్గుతుంది. ఇది కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా బంగారం ధరలపై ప్రభివం చూపుతున్నాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ఈ రోజు భారీగా పతనమైంది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గి రూ.39,860కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.750 తగ్గి రూ.43,660కి చేరింది. ఇక వెండి ధరల్లో కూడా భారీ పతనం కనిపించింది. కిలో వెండి ధర రూ.1070 తగ్గి, రూ.48,500కి దిగి వచ్చింది. ఈ ధరలు మరింతగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 

Leave a Comment