రెడ్, ఆరెంజ్ జోన్లలో Redmi, Mi, Poco ఫోన్ల అమ్మకాలు

దేశంలో రెడ్, ఆరెంజ్ జోన్లలో తమ ఉత్పత్తుల కోసం ఆర్డర్లు తీసుకుంటున్నట్లు Xiaomi మరియు Poco కంపెనీలు ప్రకటించాయి. అయితే డెలివరీలు సురక్షితంగా జరిగేలా జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కంపెనీలు తెలిపాయి. దేశంలో లాక్ డౌన్ ను ఈనెల 17 వరకు పొడిగించారు. అయితే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షల సడలింపులు ఇచ్చింది. గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ వ్యాపారాలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో Xiaomi మరియు Poco కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్మేందుకు ప్రణాళికలు రూపొందించాయి. 

దేశ వ్యాప్తంగా గ్రీన్ మరియు ఆరెంజ్ మండలాల్లో తమ ఉత్పత్తులు డెలివరీ చేస్తామని షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ ఉత్పత్తులను Flipkart, Amazon ఆర్డర్లు తీసుకుంటున్నాయని వెల్లడించారు. Poco X2 కూడా Flipkartలో అందుబాటులో ఉందని  Poco ఇండియా జనరల్ మేనేజర్ సి.మన్మోహన్ పేర్కొన్నారు. అయితే గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో మాత్రమే విక్రయాలు ఉంటాయని వివరించారు. 

Amazon లో Mi A3, Poco F1, Redmi 8A Dual, Redmi Note 8 Pro పోన్లు అందుబాటులో ఉన్నాయి. మరియు Poco X2, Redmi Note 7 Pro, Redmi 8 ఫోన్లు Flipkart లో  అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ఎంపిక చేసిన పిక్ కోడ్లలో మాత్రమే ఫోన్లు పంపిణీ చేయబడతాయి. 

 

Leave a Comment