‘శృంగారం కూడా నటనే కదా.. కథ డిమాండ్ చేస్తే దేనికైనా సిద్ధమే’ : కృతి శెట్టి

టాలీవుడ్ లో ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా మంచి క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి. అందుకే తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ’ సినిమాలో నటించింది. ఉప్పెన సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించిన బేబమ్మ.. శ్యామ్ సింగరాయలో దానికి భిన్నమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించడంపై కృతిశెట్టి స్పందించింది. 

శృంగార సన్నివేశాలు అంటే అందరూ చెడు ఉద్దేశంతోనే చూస్తారని, కానీ దానిని తాము వృత్తిపరంగానే చూస్తామని స్పష్టం చేసింది. సినిమా కోసం ఏం చేసినా అది నటనే అని చెప్పింది. యాక్షన్ సన్నివేశాల్లో ఎంత కష్టపడతామో ఇవి కూడా అంతే అని పేర్కొంది. అన్ని సీన్లలోనూ నటించినట్లే శృంగార సన్నివేశాల్లోనూ నటిస్తామని వెల్లడించింది. 

పొగ తాగడం తనకి ఇష్టం ఉండదని, కానీ ఈ సినిమాలో తాను సిగరేట్ తాగే సన్ని వేశాలు ఉన్నాయని చెప్పింది. తాను చేయనంటే డైరెక్టర్ పొగాకు లేని సిగరెట్లు తెచ్చారని, కథ డిమాండ్ చేయడం వల్ల సిగరెట్ తాగడంలో అనే జాగ్రత్తలు పాటిస్తూ ఆ పాత్రలో నటించినట్లు చెప్పింది. మూడు రోజులు ప్రాక్టీస్ చేసి సిగరెట్ తాగే సీన్లు చేశానని పేర్కొంది.  

 

 

Leave a Comment