ఏటీఎంలో రూ.5 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే మోతే..

ఇక బ్యాంకు కస్టమర్లకు ఏటీఎం ఛార్జీల మోత మోగనుంది. ఇక నుంచి ఏటీఎం నుంచి రూ.5 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ పై ఛార్జీని వసూలు చేయాలని ఆర్బీఐ కమిటీ సిపార్సు చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఛార్జీల పెంపు ఉపయోగపడుతుందని కమిటీ భావిస్తోంది.  

 ప్రస్తుతం వినియోగదారులు ఒకే లావాదేవీలో రూ.10 వేలు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి రోజుకు రూ.20 వేలు ఉపసంహరించుకోవచ్చు. అయితే ఈ విత్ డ్రా పరిమితి ఒక్కో బ్యాంక్ కు ఒక్కో విధంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కోసం రోజువారీ విత్ డ్రా పరిమితి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంటుంది.  కాగా, ఫ్రీ ట్రాన్సాక్షన్ ఉన్నప్పటికీ ఇండివిడ్యువల్స్ రూ.5 వేలు కంటే ఎక్కువ అమౌంట్ విత్ డ్రా చేస్తే బ్యాంకులు ఛార్జీలను వసూలు చేయాలని ఈ కమిటీ సిఫార్స్ చేసింది. ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజ విధానాన్ని సమీక్షించడానికి 2019 జూన్ లో ఆర్బీఐ తన ద్రవ్య విధాన ప్రకటనలో ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికను ఆర్బీఐకి అందించినా.. ఇప్పటి వరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన చేయలేదు. 

ఎంత ఛార్జ్ వేస్తారు..

ఈ కమిటీ నివేదిక ప్రకారం ఇంటర్ చేంజ్ ఏటీఎం ఛార్జీలను రెకమండ్ చేసింది. పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న సెంటర్లలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఛార్జీని రూ.2 పెంచి రూ.17కు తీసుకురుావాలని పేర్కొంది. నాన్ ఫైనాన్షియల్ లావాదేవీల కోసం, బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా పిన్ మార్పిడి వంటి వాటికి రూ.5 నుంచి రూ.7కు పెంచాలని సిఫార్స్ చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాలు, సెమి అర్బన్ ప్రాంతాలలో ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఛార్జీని రూ.3 పెంచాలని సూచించింది. 

 

Leave a Comment