వైద్యం కోసం దాచుకున్న రూ.2 లక్షలు ఎలుకలు కొరికేశాయి..!

ఓ వృద్ధుడు కూరగాయలు అమ్ముకుంటూ ఎంతో కష్టపడి వైద్యం కోసం దాచుకున్న రూ.2 లక్షలు ఎలుకలు కొరికేశాయి. 500 రూపాయల నోట్లన్నింటికీ రంధ్రాలు పడి ఉండటంతో ఆ వృద్ధుడు బోరున విలపిస్తున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని వేమునూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ తండాకు చెందిన భూక్య రెడ్యా అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకూంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా ఆయన కడుపులో కణతి పెరుగుతూ ఇబ్బంది పెడుతోంది. ఆస్పత్రులకు తిరిగితే రూ.4 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. 

ఎంతో కష్టపడుతూ రూ.2 లక్షల నగదును ఇంట్లోని బీరువాలో దాచుకున్నాడు. ఇక డబ్బు కోసం బీరువా తెరచి చూడగా రెడ్యా షాక్ అయ్యాడు. దాచుకున్న రూ.500 నోట్లన్నీ ఎలుకలు కొరికేశాయి. దీంతో రెడ్యా విలపిస్తున్నాడు. ఎలుకలు కొరకిన నగదును తీసుకుని మహబూబాబాద్ లోని ఎస్బీఐ బ్యాంక్ కు వెళ్లి అడగగా అవి చెల్లుబాటు కావని చెప్పారు. ప్రభుత్వం స్పందించిన తన వైద్యం కోసం సాయం చేయాలని కోరుతున్నాడు. 

 

Leave a Comment