ఇక నుంచి 5 రోజుల్లో రేషన్ కార్డు ..

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జారీ

సీఎం జగన్ ఆమోదం

ఇక నుంచి పేద ప్రజలు రేషన్ కార్డు కోసం ఏళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ విషయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రేషన్ కార్డు  కోసం దరఖాస్తు చేసుకుంటే..ఐదు రోజుల్లో మీ చేతికి రేషన్ కార్డు అందించేలా సరికొత్త విధానాన్ని అధికారులు రూపొందించారు. దీనికి సీఎం జగన్ నుంచి ఆమోదముద్ర కూడా లభించింది.  

ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే జారీ చేసే విధానాన్ని ఈనెల 6 నుంచి ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులను అందజేస్తుంది.  గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

అటు రేషన్ డోర్ డెలివరీలో భాగంగా త్వరలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి 10,15 కిలోల సంచులను కార్డుదారులకు అందించనుంది. ఒక్కో సంచీ తయారీకి రూ. 25 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు.

 

Leave a Comment