గుండుతో హీరోయిన్ రష్మిక.. సోషల్ మీడియాలో రచ్చ..రచ్చ..!

రష్మిక మందన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు.. ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె గుండుతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన రష్మిక అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు రష్మిక నిజంగానే గుండు కొట్టించుకుందా అని ఆమె అభిమానులు సెర్చ్ చేయగా అసలు విషయం బయటపడింది.  

తమిళనాడులోని కొన్ని సెలూన్ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫొటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫొటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రష్మిక గుండు ఫొటోలతో ఫన్నీ మీమ్స్ సృష్టిస్తూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. దీంతో రష్మిక గుండు వివాదం సోషల్ మీడియాలో రచ్చ..రచ్చగా మారింది.    

Leave a Comment