దారుణం.. రేపిస్టుకు యువతిని కట్టేసి ఊరేగించారు..!

అత్యాచారానికి గురైన అమ్మాయిని, రేప్ చేసినవాడితో కట్టేసి ఊరేగించారు. ఇద్దరిని తాళ్లతో కట్టి ఊరంతా తిప్పారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. భూపాల్ లోని ఓ గిరిజన ప్రాంతమైన అలిరాజ్ పుర్ లో ఆదివారం ఓ వ్యక్తి 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అత్యాచారం చేసిన వాడిని పోలీసులకు పట్టించాల్సింది పోయి.. ఆ బాలికను, నిందితుడిని తాడుతో కట్టేసి ఊరేగించారు కొంత మంది వ్యక్తులు. అంతే కాదు ‘భారత్ మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడితో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై, యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులపై కేసులు పెట్టి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ బాలికను అలా నిందితుడితో ఊరంతా నడిపించడంలో ఆమె కుటుంబ సభ్యుల ప్రోద్భలం కూడా ఉందని సమాచారం. 

 

Leave a Comment