తెలంగాణలో ‘జై భీమ్’ సీన్ రిపీట్.. దొంతనం నెపంతో యువకుడిని..!

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్-ఎస్ లో ‘జైభీమ్’ సినిమా సీన్ రిపీట్ అయింది. రామోజీ తండాకు చెందిన ఓ యువకుడిని దొంగతనం నెపంతో పోలీసులు చితకబాదారు. జై భీమ్ సినిమా తరహాలో దొంగతనం కేసులో ఓ గిరజనుడిని అదులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజనలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. 

రామోజీ తండాకు చెందిన వీరశేఖర్ వ్యవసాయం చేస్తుంటాడు. అందులో భాగంగా తన అన్నతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో పనిచేసుకుంటుండగా.. పోలీసులు వచ్చి వీరశేఖర్ ని తీసుకెళ్లారు. నాలుగు రోజుల క్రితం ఆత్మకూరు మండలం ఏపూరులో ఓ దొంగతనం జరిగింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ దృశ్యాల్లో రామోజీ తండాకు చెందిన ధరావత్ నవీన్ కనిపించాడు. నవీన్ ను తీసుకొచ్చిన పోలీసులు తమదైన శైలీలో విచారించారు. దీంతో నవీన్ మరో నలుగురి పేర్లు చెప్పాడు. ఆ నలుగురిలో వీర శేఖర్ కూడా ఉన్నాడు. 

వీరశేఖర్ అనే యువకుడు పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఏం చేయాలో తెలియక పోలీసులు వీరశేఖర్ ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్పృహ తప్పి పడిపోయిన ఉన్న వీరశేఖర్ ని చూసి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండా వాసులంతా స్టేషన్ ముందుకు చేరుకుని ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సీన్ ను ఆస్పత్రికి మార్చేశారు. వైద్యులు పరీక్షిస్తే అసలు విషయం బయటికొస్తుందని, తాము అసలు కొట్టలేదని బాధితుడిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు..  

Leave a Comment