ఫ్యాన్స్ కు రామ్ చరణ్ లేఖ..స్పెషల్ వీడియో పోస్ట్..!

కరోనా కాలంలో మెగా అభిమానులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క మెగా ఫ్యామిలీ కూడా కరోనా రోగులను ఆదుకునేందుకు ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పింది.. ఎవరికైనా అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సి వస్తే వెంటనే అందించి సాయం చేస్తున్నారు. ఈక్రమంలో మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి రామ్ చరణ్ స్పందించారు. వారికి ట్విట్టర్ వేదికగా ఓ లేఖ రాశారు.

 ‘అభిమానులు ఈ కోవిడ్-19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వరకు మీరు ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఎన్ని వ్యవప్రయాసలు కూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకితభావానికి నా ధన్యవాదాలు’ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. అంతే కాదు తన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలతో కూడిన ఓ వీడియోను రామ్ చరణ్ తన ట్విట్టర్ లో విడుదల చేశారు. 

Leave a Comment