రామ్ చరణ్ కు దబుల్ ధమాకా..!

రామ్ చరణ్ నేడు తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అటు రాజమౌళి, ఇటు ఆచార్య టీమ్ రామ్ చరణ్ లుక్ ను విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. సీతారామ రాజు లుక్ ను దర్శకుడు రాజమౌళి శుక్రవారం సాయంత్రమే విడుదల చేశారు. బర్త్ డేకు ఒకరోజు ముందుగానే చెర్రీ ఫ్యాన్స్ కి కానుక ఇచ్చారు. ది మ్యాన్ ఆఫ్ బ్రేవరి, హానరి, ఇంటిగ్రిటీ ప్రజెంటింగ్ మై అల్లూరి సీతారామరాజు అంటూ రాజమౌళి తన ట్విట్ లో పేర్కొన్నాడు. 

కాగా, మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆచార్య సినిమాలో చరణ్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్.. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ తో పాటు చిరు కూడా ఉన్నారు. చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్ గెటప్స్ లో చేతితో తుపాకులతో ఎగ్రసివ్ గా కనిపిస్తున్నారు. అటు ఆర్ఆర్ఆర్ నుంచి ఇటు ఆచార్య నుంచి రామ్ చరణ్ పోస్టర్లు విడుదల కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

 

Leave a Comment