మల్లెపూలు తీసుకురావడం లేదని భర్తని చంపిన భార్య..!

92
Rjasthan Women

మల్లెపూలు తీసుకురావడం లేదని, ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని భర్తను చంపించిది ఓ భార్య.. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ వార్త పోలీసులనే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఏంజరిగిందంటే.. భిల్వారా జిల్లాకు చెందిన దేవి సింగ్ పశువుల దాణా వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం వృద్ధి చేసేందుకు ఎంతో కష్టపడ్డాడు. అతనికి పింకీ అనే భార్య ఉంది. వారి జీవితం సాఫీగా సాగుతోంది. ఈక్రమంలో ఆగస్టు 22న ముగ్గురు వ్యక్తులు దేవి సింగ్ ను అతి దారుణంగా నరికి చంపేశారు. తన కళ్ల ముందే భర్త చనిపోవడంతో పింకీ గుండెలు బాదుకుంటూ రోదించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దేవి సింగ్ కి శత్రువులు కూడా లేరు. నిందితులు ఎవరో తెలియక ఒకవారం రోజులపాటు పోలీసులకు చుక్కలు కనిపించాయి. కానీ ఓ మహిళా కానిస్టుబుల్ కు మాత్రం పింకీ మీద అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పింది. 

సరే అని పోలీసులు పింకీని స్టేషన్ కు పిలిపించారు. ఆమెను తమదైన శైలిలో విచారించారు. అంతే పింకీ నిజం ఒప్పుకుంది. తన భర్తను చంపించింది తానే అని చెప్పింది. ఎందుకు చేశావని పోలీసులు అడగ్గా.. ఆయన తనకు మల్లెపూలు తీసుకురావడం లేదని, అందుకే చంపించానని చెప్పడంతో పోలీసులకు దిమ్మతిరిగిపోయిది. మొదట్లో తన భర్త రోజూ మల్లెపూలు తెచ్చి తనను సంతోషంగా చూసుకునే వాడని చెప్పింది. కానీ ఈ మధ్య ఆయనలో చాలా మార్పు వచ్చిందని, అసలు మల్లెపూలు తీసుకురావడం లేదని పేర్కొంది. ఇంటికి కూడా చాలా లేట్ గా వస్తున్నాడని, అడిగితే పని ఎక్కువగా ఉందని సమాధానం చెబుతూ వచ్చారని చెప్పింది. సుఖాన్ని పంచలేని భర్తపై తనకు ప్రేమ పోయిదని, అందుకే కిరాయి మూకకు డబ్బులు ఇచ్చి చంపించానని నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

Previous articleఅన్నతో విబేధాలపై షర్మిల క్లారిటీ ఇచ్చిందా?.. ఒంటరినయ్యానని భావోద్వేగ ట్వీట్..!
Next articleచిన్నారులకు కొత్త రకం వ్యాధి..ఇది సోకితే డేంజర్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here