కట్నం తీసుకురాలేదని.. భార్యను బంధువులతో రేప్ చేయించిన భర్త..!

దేశంలో అత్యాచారాలకు అంతేలేకుండా పోతోంది.. వావివరసలు మరిచి రెచ్చిపోతున్నారు. తాజాగా కట్టుకున్న భర్తే తన భార్యపై దురాఘతానికి పాల్పడ్డాడు..కట్నం తీసుకురాలేదని  భార్యపై బంధవులతో రేప్ చేయించాడు. దానిని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.  ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో వెలుగులోకి వచ్చింది.

వివరాల మేరకు 2019లో హర్యానాకు చెందిన మహిళతో భరత్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి వివాహం జరిగింది. వివాహం సమయంలో అత్తింటివారు అల్లడికి రూ.1.5 లక్షలు కట్నం ఇస్తామని చెప్పారు. అయితే అవి ఇవ్వలేకపోయారు. దీంతో అత్తింటివారు ఆ మహిళను వేధిస్తుండేవారు..ఆ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. 

ఈక్రమంలో భర్త ఆ మహిళకు మాయమాటలు చెప్పి ఇంటికి తిరిగి రావాలని వేడుకున్నాడు. ఇది నమ్మిన మహిళ అత్తారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన భార్య ఇంట్లో ఉండగా.. తన సమీప బంధువులు ఇద్దరిని ఇటికి పిలిచాడు. అనంతరం వారితో భార్యపైనే రేప్ చేయించాడు. అంతేకాదు.. దీనిని భర్తే తన ఫోన్ లో రికార్డు చేశాడు. దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. 

మీ కుటుంబం కట్నం డబ్బులు ఇవ్వలేదని, ఈ వీడియో ద్వారా కట్నం డబ్బులు సంపాదించుకుంటానని భర్త చెప్పినట్లు బాధితురాలు ఆరోపించింది. అక్కడి నుంచి తప్పించుకుని పుట్టింటికి వెళ్లింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులీకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.    

   

 

Leave a Comment