4 ఏళ్ల బాలిక పునర్జన్మ.. 9ఏళ్ల క్రితం మరణించిన యువతి మళ్లీ పుట్టింది..!

మనిషికి పునర్జన్మ అనేది నిజంగా ఉంటుందా? ఈ ప్రశ్న ఎప్పిటి నుంచో వినిపిస్తోంది. పునర్జన్మ గురించి ఎన్నో సినిమాల్లో చూశాం.. అయితే అది నిజమని నమ్మాలంటే మాత్రం శాస్త్రీయత అడ్డొస్తుంది. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అసలు పునర్జన్మలే లేవని కొట్టిపారేసే వారూ కూడా ఉన్నారు. తాజాగా పునర్జన్మకు సంబంధించి రాజస్థాన్ లో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

రాజ్ సమంద్ అనే గ్రామంలో కింజల్ అనే నాలుగేళ్ల పాప తన పునర్జన్మ గురించి పూస గుచ్చినట్లు వివరిస్తోంది.. ఆ పాప చెప్పిన విషయాలను ఆరా తీస్తే అది నిజమని తేలింది.. కింజల్ అనే పాప తన ఊరు పిప్లాంత్రీ అని, తన పేరు ఉష అని చెప్పంది. 2013లో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయి మరణించానని తెలిపింది. అంతేకాదు తన తల్లి, తండ్రి, సోదరుడు, భర్త, పిల్లల గురించి తండ్రి రతన్ సింగ్ ని అడిగింది. మొదట్లో ఆమె మాటలను రతన్ సింగ్ పట్టించుకోలేదు. కానీ పదే పదే ఇవే కబుర్లు చెబుతుండటంతో డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ ఎలాంటి మానసిక రుగ్మత లేదని చెప్పారు. 

అయినా కింజల్ మాటల్లో మార్పు రాలేదు. దీంతో ఆ వివరాలను ఆరా తీశారు. అంతే అందరూ షాక్ అయ్యారు. ఆమె చెప్పినవన్ని నిజం అని తేలింది. నిజంగానే పిప్లాంత్రీ అనే గ్రామంలో 2013లో ఉష అనే యువతి ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయి చనిపయింది. కింజల్ చెప్పిన పేర్లతోనే ఉష కుటుంబ సభ్యులంతా ఉన్నారు..  

అయితే ఈ విషయాన్ని ఉష కుటుంబానికి చెబితే వారు నమ్మలేదు. కానీ కింజల్ ని పిప్లాంత్రీకి తీసుకెళ్లగా.. ఆమె తన గతజన్మ విషయాలను చెప్పడంతో నమ్మాల్సొచ్చింది. బాలిక ద్వారా రెండు కుటుంబాల మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. ప్రస్తుతం తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. గతజన్మలోని తల్లిదండ్రులతో తరుచూ ఫోన్ లో మాట్లాడుతోంది. తన పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటోంది. 

 

Leave a Comment