వైద్యం కోసం వెళ్తే.. మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడు..!

ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లిని యువతి రేప్ కి గురైంది. ఆస్పత్రి ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ లో చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల యువతి తన సోదరుడితో కలిసి సోమవారం జేఎల్ఎన్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. లోబీపీతో బాధపడుతుండటంతో యువతిని అడ్మిట్ చేసుకున్నారు. 

యువతి సోదరుడు పని మీద అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అదును చూసి అక్కడి కాంట్రాక్ట్ ఉద్యోగి రాజేష్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతికి మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సోదరుడు తిరిగి వచ్చేసరికి ఆ యువతి మాట్లాడే పరిస్థితిలో లేదు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

 

 

Leave a Comment