బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్..!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. 

పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్ ను తొలగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింద. ఆయన విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

కాగా, మహ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దూమారం రేపాయి. దీంతో మజ్లిస్ నేతలు, మైనార్టీలు నగర పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్ ని అరెస్ట్ చేయాలంటూ పలు పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రాజా సింగ్ ని అరెస్ట్ చేశారు. 

 

 

Leave a Comment