ఆర్థిక ఇబ్బందులతో.. ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి ఆత్మహత్య..!

ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. రాజమండ్రిలో ఆడిటర్ గా పనిచేస్తున్న సత్యకుమార్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రిషిత(12), చిన్న కుమార్తె అద్విత(7)తో కలిసి నిన్న సాయంత్రం రాజవోలు చెరువు వద్దకు బైక్ పై వచ్చాడు.  చెరువులో తన ఇద్దరు పిల్లలను తోసేసి తాను దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఏడు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్ ను తన వాహనం వద్ద ఉంచాడు. రెండురోజుల క్రితం భార్య స్వాతి బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి విశాఖ వెళ్లారు. భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన భార్య బంధువులకు ఫోన్ చేయడంతో సమాచారం తెలిసింది. 

సంఘటన స్థలానికి వచ్చిన భార్య స్వాతి భర్త, పిల్లల మృతదేహాలను చూసి బోరున విలపించింది. పిల్లలపై ఉన్న మక్కువతోనే సత్యకుమార్ పిల్లల్ని కూడా తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోతున్నట్లు ఆ లెటర్ లో ఉంది..     

Leave a Comment