‘విలేజ్ కుకింగ్’ కుర్రాళ్లతో రాహుల్ గాంధీ..!

తమిళనాడులో కొందరు ‘విలేజ్ కుకింగ్ చానల్’ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారు. వీరు రకరకాల వంటలు చేస్తుంటారు. ఈ యూట్యూబ్ చానెల్ ను రైతులే నిర్వహిస్తారు. అయితే ఇటీవల అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టగొడుగులు(మష్రూమ్) బిర్యానీని ఆరగించారు. ఆ బిర్యానీ తిన్న రాహుల్ ఫిదా అయిపోయారు. వారితో సరదాగా ముచ్చటించారు. 

పుదుక్కోట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామంలో రైతులు ఫుడ్ అందజేస్తున్నారు. వారి నడిపే యూట్యూబ్ చానల్ కు చాలా మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. చానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వారి గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ వారి దగ్గరకు వెళ్లారు. 

వారితో కొద్ది సేపు ముచ్చటించి వారు చేసిన పుట్టగొడుగుల బిర్యానీ రుచిని రాహుల్ ఆస్వాదించారు. అంతే కాదు వంటకం తయారీలోనూ రాహుల్ ఓ చేయి వేశారు.  ఆ తర్వాత మీ లక్ష్యం ఏంటని రాహుల్ గాంధీ వారిని ప్రశ్నించగా.. విదేశాల్లో తమ వంటలను చేయాలనుకుంటున్నామని వారు తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్న తన స్నేహితుడు శ్యామ్ పిట్రోడాకు చెబుతానని, అక్కడికి వెళ్లవచ్చని సూచించారు. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Leave a Comment