టీమిండియా కొత్త కోచ్ గా రాహుల్ ద్రవిడ్..!

టీ20 వరల్డ్ కప్ అనంతరం రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే.. దీంతో హెడ్ కోచ్ పదవి కోసం కుంబ్లే సహా పలువురు విదేశీ ఆటగాళ్ల పేర్లు వచ్చాయి. ముఖ్యంగా టామ్ మూడీ, మహెళ జయవర్ధనే, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే పేర్లు వినిపించాయి. అయితే బీసీసీఐ మాత్రం మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ వైపే మొగ్గుచూపింది. 

తొలుత ఈ పదవి చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. హెడ్ కోచ్ గా చేయనని ద్రవిడ్ నిరాకరిస్తూ వచ్చారు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా రంగంలోకి దిగారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత బీసీసీఐ ద్రవిడ్ తో మాట్లాడారు. చివరికి ద్రవిడ్ కు నచ్చజెప్పి ఒప్పించారు. దీనికి రాహుల్ ద్రవిడ్ కూడా ఒప్పుకున్నారు. 

టీ20 వరల్డ్ కప్ ముగియగానే రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తర్వరలోనే ఎన్సీఏ పదవికి రాహుల్ ద్రవిడ్ రాజీనామా చేయబోతున్నారు. మరోవైపు బౌలింగ్ కోచ్ గా ఆర్.శ్రీధర్ స్థానంలో పరాస్ కావాలని ద్రవిడ్ కోరినట్లు తెలిసింది. దీనికి దాదా కూడా అంగీకరించారు. అయితే బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్ కొనసాగనున్నారు. రాహుల్ ద్రవిడ్ కి 10 కోట్ల రూపాయల జీతాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.. 2023 ప్రపంచ కప్ ముగిసే వరకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనా? మీ సమాధానాలు కామెంట్ల రూపంలో చెప్పగలరు…

Leave a Comment