అది దేశానికే హానికరం.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్..!

మెజారిటీవాదం భారతదేశ భవిష్యత్తుకు మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ రాఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఓ వెబినార్ లో ఆయన ప్రసంగిస్తూ.. విమర్శలకు వ్యతిరేకంగా శాసనపరమైన పరిమితులను తొలగించడం గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. 

సమాజంలోని ఒక వర్గాన్ని పక్కకు నెట్టివేయడం ద్వారా సాధించలేని సమ్మిళిత వృద్ధి భారతదేశానికి అవసరం కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. భారత్ పురోగతిని ప్రతిదశలోనూ ఈ మెజారిటీ వాదం నిరోధిస్తుందని అభిప్రాయపడ్డారు. మెజారిటీవాదం ప్రజలను విభిజిస్తుందని, కలిసి ఉండాల్సిన సమయంలో ఈ విభజన మంచిది కాదని, ఇదే జరిగితే అంతర్జాతీయంగా దేశానికి బెదిరింపులు పెరుగుతాయని అన్నారు.   

భారతదేశ వృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. అది బలంగా ఉన్నప్పటికీ.. దీనిపట్ల దేశం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. భారతదేశంలో మంచి సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించలేదన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ ఎకానమీ వాస్తవంగా అంత అద్భుతంగా లేదన్నారు. ప్రస్తుతం పలు విభాగాల్లో కరోనా మహ్మమ్మారి కంటే ముందు ఉన్న రేఖకు దిగువన ఉందన్నారు. గణాంకాలు వాస్తవికంగా ఉండాలని, దాచిపెట్టే విధంగా ఉండకూడదని రఘురామ్ రాజన్ వివరించారు.      

 

Leave a Comment