‘నేను ఆ టైప్ కాదు’.. ఆకట్టుకుంటున్న ‘రాధే శ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్..!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఆదివారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సినిమాను నిర్మిస్తున్నారు. 

‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా’ అంటూ పూజా ప్రశ్నించగా, ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు’ అని ప్రభాస్ చెప్పె డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. 

Leave a Comment