సమంత ఐటెం సాంగ్ పై ‘పురుషుల సంఘం’ కేసు..!

‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. విడుదలైన కొద్ది సమయంలోనే మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సాంగ్ ఇప్పుడు వివాదాస్పంగా మారింది.

‘మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ సాగిన ఈ పాట లిరిక్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాంగ్ పై ఆంధ్రప్రదేశ్ లోని పురుషుల సంఘం కేసు వేసింది. పుష్ప టీంతో పాటు పాటలో నర్తించిన సమంతపై కూడా పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఆ పాట ఉందని, ఆ పాటలో పదాలతో అలాంటి భావమే వస్తోందని ఆ సంఘం ఫిర్యాదులో పేర్కొంది.  పాటను నిషేధించాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. 

ఇక ఈ పాటలో సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక వైపైతే.. సింగర్ ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్ తో వేరే లెవెక్ కి తీసుకెళ్లింది. ఈ పాటపై ఊహాగానాలు హై రేంట్ లో ఉన్నాయి. ఈ పాట థియేటర్స్ లో వేరే లెవెల్ లో ఉంటుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్ప టీం చెప్పింది. ఇక సమంత కూడా ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తుండటంతో ఈ పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది.   

  

Leave a Comment