సమంత పాటకు కౌంటర్ గా.. మేల్ వెర్షన్ సాంగ్ చూశారా..!

పుష్ప సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా’ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ పాట ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే.. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ సాగిన ఈ పాట లిరిక్స్ పై పురుష సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పాటను నిషేధించాలంటూ ఏపీ పురుష సంఘం కేసు కూడా వేసింది. 

ఇదిలా ఉంటే యూట్యూబ్ లో మరో పాట ట్రెండింగ్ లో ఉంది. పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మామ’ పాటకు కౌంటర్ గా ‘ఊ అంటావా పాపా’ అంటూ పేరడీ సాంగ్ వచ్చేసింది. ‘మీ మగ బుద్ధే వంకర బుద్ధి’ అన్న రీతిలో ‘మీ ఆడ బుద్ధే వంకర బుద్ధి’ అంటూ లిరిక్స్ తో ఆడవాళ్లకు కౌంటర్ ఇచ్చారు. ఒరిజనల్ పాటకు అపోజిట్ లిరిక్స్ తో ఈ పేరడి రూపొందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే కేవలం వినోదం కోసమే ఈ పాటు చేసినట్లు దీని రూపకర్తలు వెల్లడించారు. 

Leave a Comment