అమెరికాలో ఉద్యోగం వదిలేసి.. సొంత ఊరిలో లైబ్రరీ స్టార్ట్ చేశాడు..!

ఇప్పుడు ప్రపంచమంతా ఆన్ లైన్ మయం.. టెక్నాలజీ పెరగడంతో గ్రంథాలయాలు కూడా ఈ-లైబ్రరీలుగా మారిపోయాయి. దీంతో గ్రంథాలయాలు నిర్వీర్యం అవుతున్నాయి. కానీ ఆన్ లైన్ లో ఎంత చదివినా.. గ్రంథాలయంలో లభించే అనుభూతే వేరు.. అందుకే గ్రంథాలయాన్ని కొత్త తరానికి అనుగుణంగా తీర్చిదిద్దాడు ఈ యువకుడు.. అతడే సిరిసిల్లకు చెందిన పూర్ణ చందర్..

పూర్ణ తన చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగానికి వెళ్లాడు. అక్కడ కొంత కాలం జాబ్ చేసి మళ్లీ హైదరాబాద్ వచ్చేశాడు. అయితే అమెరికాలో ఉన్నప్పటికీ పూర్ణకు సిరిసిల్ల గురించే ఆలోచనలు ఉండేవి. అక్కడి యువతకు దిశా నిర్దేశం చేయాలని ఆలోచించేవాడు. యువతో మార్పు తీసుకురావాలి.. వారిని లక్ష్యం వైపు మళ్లించాలని ఉండేది.

అమెరికా నుంచి తిరిగి వచ్చాకా.. 2014లో జనవరి 14న సిరిసిల్లలో ‘అక్షర చైతన్య లైబ్రరీ ఆఫ్ హ్యూమన్ అండ్ ఎడ్యుకేషన్’ పేరుతో లైబ్రరీ స్టార్ట్ చేశాడు. మొదట్లో రూ.50 వేలు ఖర్చు పెట్టి ఒక చిన్న గదిలో లైబ్రరీ ఏర్పాటు చేశాడు. అప్పట్లో లైబ్రరీలో 1200 పుస్తకాలు ఉండేవి.. హైదరాబాద్ లో ఉండటం వల్ల పూర్ణకు లైబ్రరీ చూసుకోవడం కష్టమైపోయింది. దీంతో ఓ ఉద్యోగిని నియమించుకున్నాడు. 

‘అక్షర చైతన్యం’ లైబ్రరీలో ఐదో తరగతి నుంచి ఐఏఎస్ వరకు ఐటీఐ నుంచి ఎంబీఏ వరకు అన్ని పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లభిస్తాయి. సివిల్స్, గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగాలు ఇలా ఏదో ఒక లక్ష్యంతో లైబ్రరీకి వస్తారు యువకులు. మొదట్లో లైబ్రరీకి వెళ్లి చదువుకుంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుందేమో అని చాలా మంది వెనుకడుగు వేశారు. క్రమంగా పూర్ణ మనుసు అర్థమైంది..  

ఆ తర్వాత లైబ్రరీ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాడు. నిపుణులను, ఉద్యోగార్థులను ఓ వేదిక మీదికి తెచ్చి లైబ్రరీని స్ఫూర్తి కేంద్రంగా తీర్చదిద్దాడు. మొబైల్ ఫోన్ లో సమయం వృథా చేసే చాలా మంది యువకులు లైబ్రరీని సద్వినియోగం చేసుకుని ప్రయోకులుగా మారారు. బాగా చదువుకున్న వారు కూడా సరైన కెరీర్ గైడెన్స్ లేకపోవడం వల్ల చిన్నచిన్న ఉద్యోగాల్లో స్థిరపడుతుంటారని, కెరీర్ గైడెన్స్ తో స్పష్టమైన అవగాహన పెంచుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలనేది తన లక్ష్యం అని పూర్ణ అంటున్నారు. 

 

Leave a Comment