కరోనా వ్యాక్సిన్ వద్దంటూ చెట్టెక్కాడు..!

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా చేపట్టడం ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది ఇప్పటికీ వెనకడుగు వేస్తున్నారు. తాజాగా టీకా వద్దని భయంతో ఓ వ్యక్తి చెట్టెక్కాడు. ఆరోగ్య కార్యకర్తలకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. 

స్థానిక కోనేరికుప్పం గ్రామస్తులకు ఆరోగ్య సిబ్బంది టీకా వేసేందుకు వచ్చారు. ఆ సమయంలో ముత్తువేల్(39) అనే వ్యక్తి తనకు టీకా వద్దంటే వద్దంటూ చెట్టెక్కి కూర్చున్నాడు. ముత్తువేల్ గతంలోనూ పలు మార్లు ఆరోగ్య సిబ్బందిని తప్పించుకుని తిరిగాడు. తాజాగా డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ చేపట్టిన ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంత బతిమాలినా కిందకి దిగేందుకు ఒప్పుకోలేదు. ఎంతసేపటికీ చెట్టు దిగకపోయేసరికి ఆరోగ్య సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకు టీకా వద్ద అనేందుకు అసలు కారణమేంటంటే.. టీకా తీసుకుంటే మద్యం తాగకూడదని అంటారనే భయంతోనే అంటా..ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

  

Leave a Comment