వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన ప్రధాని మోడీ..!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని మోడీ శనివారం ఉదయం 10.30 నిమిషాలకు వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 ప్రాంతాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్నిన్ ఇస్తున్నారు. 

తొలి రోజు హెల్త్ వర్కర్లకు మాత్రమే కరోనా టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత దశల వారీగా సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రానుంది. తొలి విడతలో 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నారు. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్ ఇవ్వనున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1075ను సైతం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. అయితే గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

 

Leave a Comment