వంట నూనె ధరల్లో తగ్గింపు.. వినియోగదారులకు ఊరట..!

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా వంట నూనెల ఇంపోర్ట్స్ పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఈ నిర్ణయంతో వంట నూనెల పెరుగుదలతో ఇబ్బందులు పడ్డ వినియోగదారులకు ఊరట లభించింది. 

వంట నూనెల ధరల్లో 20 శాతం వరకు తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ కొత్త ధరలు జూన్ 17 నుంచి అంటే గురువారం నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్ లో పేర్కొంది. 

వంట నూనెల ధరలు ఇలా ఉన్నాయి:

  • పామాయిల ధర రూ.115 లకు తగ్గింది. పాత ధర రూ.142 ఉండగా, ఇది 19 శాతం తగ్గించారు.
  • సన్ ఫ్లవర్ నూనె రూ.157కు తగ్గింది. పాత ధర రూ.188 ఉండగా, ఇది 16 శాతం తగ్గించారు.
  • సోయా నూనె రూ.138 కు తగ్గింది. పాత ధర రూ.162 ఉండగా, ఇది 15 శాతం తగ్గింది.
  • ఆవ నూనె రూ.157కు తగ్గింది. పాత ధర రూ.175 ఉండగా, ఇది 10 శాతం తగ్గించారు. 
  • వేరు శనగ నూనె రూ.174కు తగ్గింది. పాత ధర రూ.190 ఉండగా, ఇది 8 శాతం తగ్గించారు. 
  • వనస్పతి రూ.141కు తగ్గింది. పాత ధర రూ.184 ఉండగా, ఇది 8 శాతం తగ్గించారు.  

Leave a Comment