కరోనా విషయంలో జాగ్రత్తలు..

ప్రస్తుతం ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేసింది. ఇక మనకు ఏం కాదులే..హాయిగా ఫ్రెండ్స్ తో కబర్లు చెప్పుకుందాం.. రోడ్ల మీద ఏది పడితే అది లాగేద్దాం..మనకు  ఏమవుతుంది..అని చాలా మంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరియు గుంపులు గుంపులు గుమిగూడుతున్నారు. ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని ఎంతో మర్యాదగా చెబుతున్నా..పెడచెవిన పెట్టేస్తున్నారు. కనీసం భౌతిక దూరం కూడా పాటించటం లేదు. మాస్కులు పెట్టుకోవడం లేదు. అలాంటి వారు ఇది తప్పకుండా తెలుసుకోవాలి…

మనం పీల్చే గాలి మంచిదేనా? మనం పట్టుకున్నవన్నీ శుభ్రమైన వస్తువులేనా? మన చుట్టు ఉన్న వారంతా ఆరోగ్యవంతులేనా? మన కంటికి కనబడేదంతా నిజం కాదు..

ఇప్పటి వరకు కరోనా వచ్చిన వారు, వారు పక్కింటివారు, వీధిల్లోని వారు, ప్రాంతంలోని వాళ్లు మీలానే ఆలోచిస్తూ మాకు రాదు అని అజాగ్రత్తగా ఉన్న వారే కరోనాకు గురవుతున్నారు. కరోనా నాకు దగ్గరగా లేదుగా.. అని అనుకోకూడదు..మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి మన చుట్టూ కరోనా వైరస్ ఉంది. 

 ఏమీ అవ్వదు అనుకుంటే మనం మన కుటుంబం,  బంధువులు, స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..మనకంటే ఎంతో.. ఎంతెంతో డెవలప్‌ అయిన దేశాల్లో మరణమృదంగం మోగుతోంది. సామాన్యుల నుంచి అధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు.

కరోనాపై అసలు విషయం తెలుసుకోండి…

చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే..కరోనా వస్తే ఏమవుతుంది? జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా..సీజనల్ వ్యాధిలాగా నాలుగు రోజులు ఉండి పోతుంది అనుకుంటున్నారు.. కానీ కరోనా అలా కాదు. దగ్గు దగ్గి..దగ్గి ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. ఆ దగ్గు వల్ల లంగ్స్ దెబ్బతింటాయి. లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. గుండె గతి తప్పుతుంది. 

ఇమ్యూనిటీ పవర్ ఉన్న వారు త్వరగా కోలుకుంటారు. లేకుంటే ఇబ్బంది పడతారు. హాస్పిటల్లో  చేర్చటానికి మన అనుకున్న వారు కూడా రాలేరు. మనం జాగ్రత్తలు తీసుకోకుండా కరోనా వ్యాధి వ్యాప్తి త్వరగా చెందుతుంది, తర్వాత కనీసం హాస్పిటల్ లో చేరాలంటే బెడ్డు కూడా దొరక్కపోవచ్చు.   ఒకవేళ మనం హాస్పటల్ లో ఉంటే  కన్న తల్లిదండు్రలు, కొడుకు,  కూతురు.భార్య, భర్త ఎవరిని కలవలేము…ఎందుకంటే  కలిస్తే వారు ప్రమాదంలో పడతారు…

పదే పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది..కష్టంతో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. “కాపాడండి డాక్టర్” అని అరిచిగీపెట్టినా వినటానికి కూడా పక్కన ఎవరూ ఉండక పోవచ్చు. ఉన్నా ఎవరూ ఏం చేయలేరు…

మనం చనిపోతే  కనీసం మృతదేహాన్ని కూడా ఇంటికి పంపలేని పరిస్థితి.. ఎందుకంటే ఇతరులకు వ్యాప్తి చెందుతుందో అన్న భయం. ఇది మనకు అవసరమా.. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఈ ధీమా? ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు..అనవసరంగా మన, మనవాళ్ల ప్రాణాలు తీసుకుందామా? 

మనం బయటకు వచ్చినప్పుడు మొహానికి మాస్క్, బయటవారికి దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే చాలు..80 శాతం కరోనా దరికి చేరకుండా ఉంటుంది. అత్యవరం అయితేనే బయటకు రండి..మనం బతికి ఉంటేనేగా మన ఇంట్లో వాళ్లు సుఖంగా ఉండగలరు. 

ఒక సారి ఆలోచించండి..

మన పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఢిల్లీ, దేశాలు అమెరికా, రష్యా, స్పెయిన్, ఇటలీ ప్రజలు ఎదుర్కొంటున్న నరకం మనకు రాకుండా చూసుకుందాం.. మహా అయితే కోలుకోవడానికి కష్టాన్ని, నష్టాన్ని పూడ్చుకోవడానికి కొన్ని నెలలో, లేదా ఏడాదో పడుతుంది. జీవితాన్ని కోల్పోవడం కన్నా..జీవితంలో కొన్ని నెలలు కోల్పోవడం బెటర్ కదా..ఆలోచించండి.

Leave a Comment