కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్..!

సెలబ్రెటీలు ఏం చేసినా అది సంచలనమే.. అందులోనూ సినీ సెలబ్రెటీల ఇళ్లలో ఏ చిన్న సెలబ్రేషన్స్ చేసుకున్న అది పెద్ద వార్తే అవుతుంది.. తాజాగా ప్రకాశ్ మళ్లీ పెళ్లి ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటి ప్రశార్ రాజ్ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా.. అసలేం జరిగిందో చూడండి..

ప్రకాశ్ రాజ్ తన మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఆయన కొరియోగ్రాఫర్ పోనీవర్మను 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన చేతికి శస్త్ర చికిత్స జరిగి డిశ్చార్జ్ అయ్యాడు. 

కాగా ఆగస్టు 24న ప్రకాశ్ రాజ్ పెళ్లి రోజు.. ఈ సందర్బంగా ఆయన రాత్రికి రాత్రే మరోసారి తన భార్యను పెళ్లి చేసుకున్నాడు. అయితే అది నిజమైన పెళ్లి కాదండోయ్.. ఉత్తుత్తి పెళ్లి మాత్రమే.. తన కొడుకు వేదాంత్ కోరిక మేరకు ఇలా చేసినట్లు ప్రకాశ్ రాజ్ వెల్లడించాడు. ‘మేమిద్దరం పెళ్లి చేసుకొని 11 ఏళ్లు కావడంతో పెళ్లి రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మా కొడుకు వేదాంత్ మా పెళ్లిని చూడలేదని అన్నాడు. అతడి కోరిక మేరకు రాత్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాం’ అని ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

 

Leave a Comment