సోనూ సూద్ ను సత్కరించిన ప్రకాశ్ రాజ్..

లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి అవసరమైన వారిని ఏదో విధంగా ఆదుకుంటున్న సోనూ సూద్ ప్రజల నుంచి ఆదరాభిమానాలు పొందారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా సోనూసూద్ ను ప్రశంసిస్తున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఆగిన ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ కోసం సోనూసూద్ హైదరాబాద్ వచ్చారు. 

తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నారు. కోవిడ్ సమయంలో కొన్ని వేల మంది ప్రజలకు సాయం చేసిన సోనూ సూద్ ను అభినందిస్తూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ షూటింగ్ సెట్ లోనే ప్రత్యేకంగా సత్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతుంది. కాగా ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తుండగా నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 

Leave a Comment